Sree Rama Dasu Mandhiram | Rama Dasu Temple | Nelakondapalli | Khammam | Telangana Tourism
ఇది ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లి గ్రామములో కలదు. ఈ మందిరమును గ్రామవాసులు రామదాసు గారి జ్ఞాపకార్ధము 1972లో కట్టించినారని తెలియచున్నది. రామదాసుగారు. మహాభక్తులు. వారి నివాస స్థలంలోనే ఈ మందిరం కట్టబడుట విశేష విషయము. ఒకప్పుడీ స్థలమును ప్రయాగలక్ష్మీ నరసింహంగారికి రామదాసుగారో, లేక వారి వంశీకులో దానముగా ఇచ్చియున్నారు. ఇపుడా స్థలమును గ్రామవాసులు లక్ష్మీనరసింహంవారి వంశీకుల వద్ద విరాళంగా పొంది అచట భక్తరామదాసు గారి మందిరమును నిర్మించుట విశేష విషయం. ఇచట ఈ మందిర నిర్మాణం జరుగక పూర్వం రామదాసు పేరు మీదనొక జ్ఞానపీఠము వెలసి, ప్రజలకు జ్ఞానబోధ చేయుచుండేది. తరువాత పౌరులు ఆ స్థలంలో రామదాసు మందిరమును కట్టించి, భద్రాచల దేవస్థానం వారికి అప్పగించారు.
ఎనంబైలు : పాల్వంచు 11 కి.మీ. దూరంలో గల ఈ ప్రదేశంలో కిన్నెరసాని ప్రాజెక్టు నిర్మించబడింది.
పాల్వంచ : కొత్తగూడెంకు 11 కి.మీ.ల దూరంలో గల ఈ ఊరునందు అనేక పరిశ్రమలు స్థాపించబడ్డాయి. థర్మల్ పవర్ స్టేషన్, స్పాంజి ఐరన్ కర్మాగారాల ఉన్నాయి.
No comments