Sree Stambhaadri Lakshmi Narasimha Swamy Temple | Narasimha Swamy | Khammam | Telangana
శ్రీ స్తంబద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం ఖమ్మం జిల్లాలో జిల్లా కేంద్రమైన ఖమ్మంలో కలదు. ఇది ప్రాచీన ఆలయము. రెడ్డిరాజుల కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినదని తెలియుచున్నది. గర్భగృహం, అంతరాలయం, మండపం అను మూడు భాగాలు గల ఈ ఆలయము నందు గర్భగృహంలో లక్ష్మీనరసింహ స్వామియు, అంతరాలయము నందు కుడివైపున రాజ్యలక్ష్మి అమ్మవారును, ఎడమ వైపున కేశవస్వామియు, ఆయనకు ముందు భగాన అండాళును దర్శనమొసగుచుందురు. ఆలయానికి ఉత్తరభాగాన దేవుని కళ్యాణ మండపమును, సాధారణ కళ్యాణ మహోత్సవము జరుగుచుండును. సాధారణ కళ్యాణ మండపంలో నవ వధూవరుల వివాహ మహోత్సవాలు జరుగుచుండును.
No comments