Header Ads

Header ADS

Story of Srisailam hemareddy Mallamma Must Read Real Story Of 14th Century


14వ శతాబ్దంలో రామాపురం అనే గ్రామం శ్రీశైలం కి దగ్గరగా ఉండేది ఆ గ్రామంలో నాగిరెడ్డి గోవమ్మ అని ఇద్దరు దంపతులు ఉండేవారు. వారు సిరిసంపదలు కలిగిన వారు, ఈ దంపతులు వీరశైవ మతానికి చెందినవారు. ఈ దంపతులకు ఉన్న ఒకే ఒక్క లోటు పిల్లలు లేకపోవడం. దీనివల్ల వాళ్లు చాలా బాధపడేవారు. ఒక రోజు శ్రీశైలం మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్లి శివరాత్రి నాడు మనసు పూర్తిగా ప్రార్థించుకున్నారు పూజలు చేశారు, వారి బాధ ఆ పరమేశ్వరునితో చెప్పుకున్నారు.

అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత నాగిరెడ్డి కలలో మల్లికార్జున స్వామి కనిపించి "నీకు ఒక కూతురు పుట్టబోతుంది, నీ కూతురు నాకు పరమ భక్తురాలిగా సేవలు అందిస్తుంది" అని చెప్పి ఆ మల్లికార్జున స్వామి కలలో నుండి వెళ్లిపోయారు. ఈ విషయం నాగిరెడ్డి గోవమ్మకు చెబుతూ ఎంతో సంతోషపడ్డాడు.

అలా కొన్ని రోజులు గడిచాక నాగిరెడ్డికి ఒక కూతురు జన్మించింది, ఆ కూతురికి మల్లమ్మ అని పేరు పెట్టుకుంటారు. మల్లమ్మను తల్లిదండ్రులు ఎంతో ఆప్యాయతంగా పెంచుకుంటారు. చిన్ననాటి నుంచి మల్లమ్మ మల్లికార్జున స్వామిని ఎంతో ఆప్యాయంగ భక్తితో పూజించేది ఈ విషయం చూసి తన తల్లిదండ్రులు ఎంతో సంతోషపడేవారు.

అలా కొన్ని రోజులు గడిచాక మల్లమ్మకు పెళ్లి ఈడు వచ్చింది. అది గమనించిన మల్లమ్మ తల్లిదండ్రులు హేమారెడ్డి కొడుకు అయిన బరమారెడ్డి అనే ఒక వ్యక్తితో సంబంధం చూసారు. అతడు సిద్దాపురం అనే గ్రామానికి చెందినవారు. వీరు సిద్దపురం లోనే అతి సిరి వంతులు.

అలా ఇద్దరికీ పెళ్లి జరిగాక మల్లమ్మ అత్తారింటికి బయలుదేరింది అలా కొన్ని రోజులు గడిచాక మల్లమ్మకు ఉన్న అలవాటు ప్రకారం గ్రామంలో పేదవారికి అన్నం పెట్టడం సహాయం చేయడం లాంటిది కొనసాగిస్తూనే ఉంది
ఇవన్నీ చూసిన తన తోడికోడలు నాగమ్మ భరించలేకపోయింది మల్లమ్మను నానా కష్టాలు పెట్టడం మొదలుపెట్టిందిి, మితిమీరి పనులు చెప్పడం కూడా పెరిగింది. మల్లమ్మ పై తన అత్తగారైన హేమారెడ్డికి కూడా చాడీలు చెప్పడం మొదలుపెట్టింది.

మల్లమ్మ తోటి కోడలు మరియు మల్లమ్మ అత్తగారు మల్లమ్మని శివ పూజ కూడా ఇంట్లో చేయకూడదని హెచ్చరించారు పైగా ఆవులకు మేత వేయడానికి పంపించేవారు. అక్కడకి వెళ్లిన మల్లమ్మ ఒక గుహలో శివలింగం పెట్టుకొని ఆ మల్లికార్జున స్వామి కి విపరీతంగా పూజలు చేయ సాగింది. ఈ విషయం తెలిసిన తన అత్తగారు మల్లమ్మ భర్తకు తన ప్రవర్తన గురించి మొత్తం చెప్పి మల్లమ్మని చంపేసి ఇంకో పెళ్లి చేసుకోమని హెచ్చరించింది

భరమన్నా కోపంతో ఒక కత్తి తన వెంటపెట్టుకొని మల్లమ్మ పూజ చేస్తున్న ఆ గుహని వెతుక్కుంటూ వెళ్ళాడు. మల్లమ్మ పూజ చేస్తున్నప్పుడు తన భర్త వెనుక నుండి మల్లమ్మను పొడవ బోయాడు, క్షణాల్లో శివలింగం నుండి రుద్రరూపమెత్తిన శివయ్య భరమన్న ను, తన అత్తగారిని తన తోటి కోడల్ని చంపబోయాడు శివుడు. అప్పుడు మల్లమ్మ శివయ్య ని భక్తితో వేడుకొని తను కూడా శివుని లోకి ఐక్యమయ్యింది.

అందుకే ఈరోజు కూడా శ్రీశైలం దేవస్థానం వెనుక భాగంలో
మల్లమ్మకు సంబంధించిన ఆవు దొడ్లు ఇప్పటికీ ఉన్నాయి అంతేకాక మల్లమ్మ విగ్రహం దగ్గర బిందు నది పారుతూ ఉంటుంది ఆ బిందువు నదిని మనం మల్లమ్మ కన్నీటితో పోలుస్తాము. ఆ చోటుని స్కందపురం అని కూడా అంటాము. మల్లమ్మ విగ్రహానికి, శ్రీశైలంలో ఆ శివుడికి సమానంగా పూజలు జరుగుతూ ఉంటాయి.

No comments

Powered by Blogger.