Header Ads

Header ADS

Sree Agastheshwara Temple | Shiva Temple | Nandivelugu | Guntur | Andhra Pradesh Tourism

 


నందివెలుగు అగస్తీశ్వరాలయం)
ఆగస్త్య మహర్షి ఆంధ్రదేశంలో అడుగడుగునా శివలింగాలు ప్రతిష్టిస్తూ తాను కాశీ విశ్వేశ్వరుని వదలివచ్చిన దుఃఖం పోగొట్టుకున్నాడని చెప్తారు. అలా ఆయన ప్రతిష్టించిన క్షేత్రాలలో ఒకటి తెనాలి దగ్గరి నందివెలుగు. విజయవాడ-చెన్నై రైలు మార్గంలో ఉన్న తెనాలికి రైలు ద్వారా కానీ, బస్సులో కానీ చేరుకుని తర్వాత ఆటోలో పదిహేను నిమిషాలు ప్రయాణం చేస్తే నందివెలుగు చేరుకుంటాం. ఈ గ్రామం తెనాలిలోని భాగమే అని కూడా భావించవచ్చు.

ఈ నందివెలుగు గ్రామం అత్యంత పురాతన, చారిత్రక ప్రాముఖ్యం గల శైవ క్షేత్రం. ఆగస్త్య మహర్షి ప్రతిష్టించిన ఈ లింగం, దేవాలయం కాలగతిలో దట్టమైన అడువులు.. పెరగడంతో మానవ సంచారం లేనిదై మరుగున పడిపోయాయి.

చాళుక్యులు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో శివభక్తుడైన విష్ణువర్ధన మహారాజు ఒకసారి ఈ అరణ్య ప్రాంతానికి రాగా ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. మహాశివభక్తుడైన విష్ణువర్ధనుడు ఈ అగస్తేశ్వర స్వామికి తేజఃపుంజాలతో నిత్యార్చన జరగాలని సంకల్పించి, అమూల్యమైన రత్నాలను వినాయకుని బొజ్జలోనూ, నందీశ్వరుని శృంగంలోనూ నిక్షిప్తం చేయించారు. వినాయకుడి బొజ్జలోని రత్నాల నుంచీ వెలువడే తేజఃపుంజాలు నంది కొమ్ములలోని రత్నాలపైన పడి పరావర్తనం చెంది మూలవిరాట్టు పాదాలపై పడి నిత్యార్చన చేసేలా అతి గొప్పగా నిర్మాణం చేశారు ఆనాటి శిల్పులు. నంది కొమ్ములలోంచి వెలుగు రేఖలు రావటం వలన ఆ గ్రామం పేరే నందీ వెలుగుగా మారిపోయింది.

ఒక మంత్రవేత్త ఇక్కడికి వచ్చి, నందివెలుగు చేరుకుని నంది శృంగాలు, వినాయకుని గర్భమూ ఛేదించి రత్నాలు అపహరించాడట. మూలవిరాట్టు అగస్త్యశ్వరస్వామి వారికి ఒకవైపు పార్వతీ అమ్మవారు, ఎదురుగా జ్యోతిర్నంది, ఓ పక్క జ్యోతిర్గణపతి, మరోవైపు శ్రీ ఆంజనేయస్వామి ఉన్నారు. వీరేకాక ఇంకా తల్లి శ్రీకనకదుర్గ రమాసహిత సత్యనారాయణ స్వామివారు నటరాజు, చండీశ్వరుడు, కాలభైరవులు, నవగ్రహాధిపతులు, జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య, శ్రీ కంఠ శివాచార్యుల వారు కూడా ఇక్కడ ప్రతిష్టితులై నిలచి ఉన్నారు.


No comments

Powered by Blogger.