The Most Powerful Goddess Brahmarambha Mallikarjuna Swamy Temple | Uppal | Telangana Temples
ఉప్పల్
అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, జెన్పాక్ సమీపంలో
రెండు వందల సంవత్సరాల క్రితం గొర్రెల కాపరుల ద్వారా వెలుగు చూపిన వెలుగుగుట్ట
పుణ్యక్షేత్రం నేడు ఎత్తైన ప్రదేశంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తులతో
కిటకిటలాడుతోంది. ప్రకృతి ఒడిలో సకల సౌకర్యాలతో అందంగా తీర్చిదిద్దిన వెలుగు
గుట్టపై వేకువ జామున తొలి సూర్య కిరణాలు పడడం వలననే వెలుగు గుట్టగా ప్రసిద్ధి
చెందిందని (మల్లికార్జునుడు వెలసిన మల్లన్న గుట్టగా) పూర్వీకులు కథలుగా వెలుగు
గుట్ట మహిమలను చెబుతుండేవారు.
దీన్ని ఉర్దూలో
రోషన్ పహాడ్ అని పిలుస్తారు. రెండు దశాబ్దాల క్రితం గొర్రెలను మేపడానికి వచ్చిన
గొర్రెల కాపరులను కొండపై ఎత్తైన రాళ్ళ మధ్య గుహలో కనిపించిన శ్రీ మల్లికార్జున
స్వామి వారిని గుర్తించి వారు పూజలు చేయడం ప్రారంభించారు. ఆ తరువాత భ్రమరాంబ
మల్లికార్జున స్వామిదేవాలయం, శ్రీ దుర్గామాత
ఆలయం, ఆంజనేయస్వామి దేవాలయం, నవగ్రహ మండపాలను కురుమ యాదవులు, భక్తులంతా కలిసి నిర్మించుకుని నేడు
ఆధ్యాత్మికతకు మారు పేరుగా వెలుగుగుట్టను తీర్చిదిద్దారు.
వెలుగుగుట్టపై
శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి, గణపతి
సుబ్రహ్మణ్యస్వామి, నంది, నవగ్రహాలు, శ్రీ ఆంజనేయ
స్వామి, విగ్రహ ప్రతిష్ఠలు అత్యంత వైభవంగా జరిగాయి.
గుడి,
"గోపురం, మండపాలు విశాలముగా నిర్మించారు. నల్గొండ
జిల్లాలో తయారు చేసిన 35 అడుగుల ఏకశిల రాతి ధ్వజ స్తంభం ప్రతిష్ఠించారు. శ్రీ జగద్గురు
శంకరాచార్యులు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించి ఎందరో మహానుభావులు, ఋషులు తపస్సు చేసి దైవ దర్శనం పొందిన స్థలం అని, ఈ దేవాలయం నిర్మాణం అద్భుతంగా సాగుతుందని, భవిష్యత్తులో మహా పుణ్యక్షేత్రంగా వెలుగుతూ
భక్తుల కోరికలు తీరుస్తూ కీర్తి ప్రతిష్టలు గడిస్తోందని తెలిపారు.
No comments