Jai Nath Swamy Temple | Sree Lakshmi Narasimha Swamy | Adilabad | Telanagana Tourism
అదిలాబాద్కు 21 కి.మీ. దూరంలో ఉన్నది. అతిపురాతనమైన ఈ ప్రాంతాన్ని పూర్వం పల్లవరాజుల పాలించినారని చరిత్ర ఉంది. ఇక్కడ ఉన్న శ్రీలక్ష్మీనారాయణస్వామి వారి ఆలయం జైన వాస్తును పోలి ఉంటుంది. ఈ ఆలయము కాక మిగతా ఆలయాలు కూడా జైనవాస్తు శైలి కనిపించడం వలన ఈ ప్రాంతానికి జైనాధ్ వ్యవహరించబడుతోంది. శ్రీలక్ష్మీ నారాయణస్వామి వారి దర్శనార్థం భక్తులు పలు ప్రాంతాల నుండి వస్తూ ఉంటారు. పండుగ రోజులలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా కార్తీకశుద్ధ అష్టమి మొదలుకుని బహుళసప్తమి అనగా అక్టోబర్ నుండి నవంబర్ వరకు భక్తులు స్వామి వారికి ఘనంగా బ్రహ్మొత్సవాలను జరిపిస్తారు.
No comments