Penugonda Fort | J.P.Palace | Kumbakarna Statue | Hindupuram, Ananthapuram | AP Tourism
హిందుపురానికి 20 కి.మీ. దూరంలో గల ఈ ప్రదేశంలో విజయనగర రాజులచే నిర్మించబడిన కోట ఉంది. బాబయ్య దుర్గా దగ్గర జరిగే ఉరుసు ఉత్సవం కూడా ప్రాచుర్యం పొందినదే. గ్రామమందు అనేక దేవాలయాలు, కొండపై కోట చూడతగ్గవి.
అనంతపురం నుండి 70 కి.మీ దూరంలో ఉన్నది. విజయనగర సామ్రాజ్యం ప్రారంభ దశలో ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారట. అనంతరకాలంలో విజయనగర ప్రభువులు వేసవి విడిదిగా ఉపయోగించినారు.
ఈ ప్రాంతంలో ముఖ్యంగా చూడవలసినది పెనుగొండ ఫోర్టు, జె.పి. ప్యాలెస్. ఇంకొక ముఖ్యమైన ఆకర్షణ కుంభకర్ణుడి తోట. ఈ తోట పచ్చని చెట్లతో ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో మనసునకు ఆహ్లాదాన్నిస్తుంది. ఈ తోటలో 142 అడుగుల పొడవు, 32 అడుగుల ఎత్తు కలిగిన కుంభకర్ణుడి విగ్రహం చూసి తీరవలసిందే. ఈ విగ్రహం నిద్రిస్తున్న భంగిమలో
ఉంటుంది.
No comments