నేను నా దేశం కోసం చేసిన పోరాటం - తప్పక చదవండి Words Of Bhagat Singh
నేను భగత్ సింగ్ ని మాట్లాడుతున్నాను ఢిల్లీ అసెంబ్లీ కేసులో ఏప్రిల్ 9 1929న బికే దత్ గారితో సహా జీవిత ఖైధిగా విధించబడ్డాను.
మేము ఢిల్లీ జైలులో ట్రయిల్ ఖైదీలుగా ఉన్నంతవరకు మాకు మంచి సౌకర్యం అందించారు. ఢిల్లీ జైలు నుండి మీయాన్వాలి వరకు అంత బాగానే వుంది. కానీ ఎప్పుడైతే మేము లాహోర్ సెంట్రల్ జైలులో అడుగు పెట్టాము అక్కడి నుండి మమ్మల్ని విపరీతంగా వేధించడం జరిగింది. లాహోర్ సెంట్రల్ జైల్లో మేము వరుసగా మెరుగైన ఆహారం మరియు కొన్ని ఇతర సౌకర్యాలు కోరుతూ ఉన్నత అధికారులకు ఒక ఉత్తరం రాసాము.ఆ సమయంలో మేము జైలు ఆహారం తీసుకోవడానికి కూడా నిరాకరించాము
ఆ ఉత్తరంలో మా డిమాండ్లు ఈ కింది విధంగా ఉన్నాయి.
రాజకీయ ఖైదీలుగా ఉన్న మేము నాకు మంచి ఆహారం ఇవ్వాలి మరియు మా ఆహారం యొక్క ప్రమాణం కనీసం యూరోపియన్ ఖైదీలకు సమానంగా ఉండాలి ఇక్కడ మీరు ఒక్కటి గమనించండి మేము డిమాండ్ చేస్తుంది ఆహార సమంత్వం కాదు ఎురోపీన్ల సమంత్వం.
మేము ఎటువంటి కఠినమైన పనిని మరియు గౌరవప్రదమైన పనిని చెయ్యము, చెయ్యమని మమ్మల్ని బలవంతం చెయ్యకూడదు.
మేము అడిగిన ప్రతి పుస్తకము వ్రాత సామాగ్రి తో పాటు ఎటువంటి పరిమితి లేకుండా మాకు అనుమతించాలి.
అలాగే జైల్లో ఉన్న మా భారతదేశ ప్రతి ఖైదీకి కనీసం ఒక ప్రమాణిక దినపత్రిక అయిన సరఫరా చేయాలి
రాజకీయ ఖైదీలకు ప్రతి జైలులో వారికంటూ ఒక ప్రత్యేక వార్డు ఉండాలి యురొపియన్లతో సమానంగా అన్ని అవసరాలు మాకు అందించాలి
ఓకే జైలులో ఉన్న మా భారత దేశ రాజకీయ ఖైదీల అందరిని ఒకే వార్డులో ఉంచాలి. మరుగుదొడ్లు శుభ్రంగా ఉండాలి, నిత్యవసరాలు సరఫరా చేయాలి, మెరుగైన దుస్తులు ఇవ్వాలి. మేము చేసిన ఈ డిమాండ్లు చాలా చిన్నవి... కావున వెంటనే అంగీకరించండి.
కొన్ని రోజులకు జైలు అధికారులు మా వద్దకు వచ్చి మా డిమాండ్లను ఉన్నత అధికారులు అంగీకరించలేదని మాకు తెలిపారు.
అంతేకాకుండా ఆ రోజు నుంచి మమ్మల్ని విపరీతంగా వేధించడం మొదలుపెట్టారు నాకు బలవంతంగా ఆహారం ఇవ్వాలని చూశారు కానీ నేను తీసుకోలేదు. జూన్ 10వ తారీకు 1929న నేను సుమారు ఒక 15 నిమిషాలు స్పృహ కోల్పోయాను. చివరికి మా పరిస్థితి తెలుసుకున్న యూపీ జైలు కమిటీలో ఉన్నా జగథ్ నరైనా మరియు కే.బి.Hafiz Hidayat Hussain మాకోసం ఉన్నత అధికారులను మేము అడిగిన డిమాండ్లు మరియు సౌకర్యాలను వెంటనే ఇవ్వాలని కోరారు. అధికారులు దానికి అంగీకరించి మన భారతదేశపు రాజకీయ ఖైదీలు అందరికీ ప్రతి జేల్లో మంచి సౌకర్యాలు అందుబడ్డాయి.
No comments