ఓం కార రూపం శివం శివం - ఉమమార్కండేశ్వర స్వామి ఆలయం | సారంగదారేశ్వర ఆలయం
శివుడి అనుగ్రహంతో చిరంజీవి అయిన భక్త మార్కండేయుడి కథ తెలిసిందే, సారంగదారుడి గురించి కథలు నాటకాలు సినిమాల ద్వారా వినే ఉంటాం. ఆ రెండు కథలకు పుట్టినిల్లు మన రాజమహేంద్రవరమేనని మన చరిత్ర చెబుతుంది.
రాజకీయంగాను ఆర్థికంగా గాను సాంఘిక చారిత్రక ప్రాముఖ్యత కలిగిన పట్టణం రాజమండ్రి. లలితా దేవి శ్రీ చక్ర మధ్యగతమై దర్శనం ఇచ్చి ఇంద్రుడికి విజయాన్ని ప్రసాదించిన చోటు కోటిలింగాల రేవు ఇది కూడ రాజమండ్రిలోనే ఉంది. అలాగే ఈ పట్టణంలో ఉన్న మరో రెండు పుణ్యక్షేత్రాలు ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయం మరియు సారంగదారీశ్వరాలయం.
పూర్వంలో మృకండు మహర్షి సంతానం కోసం శివున్ని ఆర్థిస్తూ ఘోర తపస్సు చేశాడు, ఆ తపస్సు మెచ్చి మహాశివుడు ప్రత్యక్షమై నీకు ఏం వరం కావాలో కోరుకోమని చెప్పాడు. అప్పుడు మృకండు మహర్షి నాకు సంతానం కావాలని కోరుకున్నాడు. అప్పుడు శివుడు సంపూర్ణ ఆయుర్దాయంతో ఐదోతనం లేని ఆడ శిశువు కావాలో లేక 16 ఏళ్లకే ఆయుష్షు నిండే తేజావంతుడైన కుమారుడు కావాలో కోరుకోమన్నాడు, దానికి ఆ మహర్షి కొడుకుని ఇవ్వమని కోరుకున్నాడు.. అయితే కొంతకాలానికి మృకండు మహర్షి దంపతులకు మగ బిడ్డ జన్మించాడు. ఆ పిల్లవాడికి మార్కండేయుడు అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచుకోసాగారు వారిద్దరు.
ఒకరోజు ఆ దంపతులు మార్కండేయునికి అతని ఆయుష్షు గురించి చెప్పి చాలా బాధపడ్డారు. మార్కండేయుడు తన తల్లిదండ్రులని ఓదార్చి తన చివరి రోజుల్లో శివసేవ చేసుకుంటానని బయలుదేరాడు. ఇక తపస్సు కోసం వెతుక్కుంటూ మార్కండేయుడు రాజమహేంద్రి ప్రాంతంలోని గౌతమి తీరానికి చేరుకున్నాడు. పవిత్రమైన ఆ ప్రదేశంలో ఇసుకతో శివలింగాన్ని చేసి ఘోర తపస్సు చేశాడు.
అతని ఆయువు తీరే గడియాలు సమీపించగానే యమధర్మరాజు తన పాషాన్ని అతనిపై విసిరాడు. మార్కండేయుడు అప్పటివరకు తపస్సు చేస్తున్న శివలింగాన్ని కౌగిలించుకొని రక్షించమని వేడుకున్నాడు. భక్తుని మొర విని పరమశివుడు ఆగ్రహంగా ప్రత్యక్షమయ్యాడు ఆ కోపం చూసి యముడు శంకరుని శరణ వేడి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. భక్తితో తనను ప్రసన్నం చేసుకున్న మార్కండేయునికి మళ్లీ ఆయుష్షుని ప్రసాదించాడు మహాశివుడు. అలా ఆ మార్కండేయుడు ప్రతిష్టించిన శివలింగమే ఈ ఉమా మార్కండేయ స్వామి ఆలయం. ఈ ఆలయం రాజమండ్రిలో కొలువై ఉంది.
సారంగధర ఆలయం :
సారంగదారుని కథను ఆధునికులు కొట్టి పారేస్తూ ఉంటారు. కానీ రాజమహేంద్రిలో అది నిజంగానే జరిగిందని స్థానికుల విశ్వాసం. అందుకే రాజా రాజా నరేంద్రుడు సారంగదారుడికి శిక్ష విధించిన ప్రదేశాన్ని సారంగధార మెట్టు, అతడు పూజించిన శివలింగాన్ని సారంగదారేశ్వరుడు అని పిలుస్తారు.
ఒకప్పుడు రాజమహేంద్రిని పరిపాలించిన రాజరాజ నరేంద్రుడి కుమారుడు సారంగదారుడు. మంచి విద్య కలిగిన వాడు అందులో మన్మధుడు రాజరాజ నరేంద్రుని రెండో భార్య చిత్రాంగి ఆమె అపురూప లావణ్య రాశి. అనుకోకుండా సారంగదారుని చూసిన చిత్రానికి అతని అందానికి మగ్దురాలై మొహం పెంచుకుంది. తన కోరిక తీర్చమని కోరగా నీవు నాకు తల్లితో సమానం అంటూ సారంగదారుడు తిరస్కరించారు. అది అవమానంగా భావించిన చిత్రానికి సారంగదారుడు తనతో తప్పుగా ప్రవర్తించాడని తన భర్త రాజరాజ నరేంద్రునికి లేనిపోని మాటలు చెప్పింది.
ఆమె మాటలు నమ్మిన రాజు కన్న కొడుకు అని భావన లేకుండా సారంగదారున్ని కాళ్లు చేతులు నరికించాడు. ఆ తర్వాత అక్కడి నుండి వెళ్తున్న మీనా నాధుడు అనే సన్యాసి తన మంత్ర శక్తితో సారగాదారున్ని కాలు చేతులు రప్పించాడు. ఆ తరువాత సారంగదారుడు సన్యాసం పుచ్చుకొని అదే ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ జీవిస్తూ ఉండేవాడు. అప్పట్లో ఆ సారంగదారుడు ప్రతిష్టించిన శివలింగాన్ని సారంగదారేశ్వరుడిగా భక్తులు పూజిస్తూ ఉంటారు అని స్థల పురాణం చెబుతుంది.
1976లో భక్తుల సహకారంతో ఈ ఆలయాన్ని నిర్మించారు సారంగదారేశ్వరుడితోపాటు బాల త్రిపుర సుందరి లక్ష్మీ గణపతి ఈ గుడిలో పూజలు అందుకుంటూ ఉంటారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి సమయంలో కనుమనాడు ఇక్కడ జాతర జరుగుతుంది. అప్పట్లో చిత్రాంగి నివసించిందని చెప్పే భవనాన్ని నేటికీ ఈ ప్రాంతంలో చూడొచ్చు.
No comments