Sri Chandrakanthula Somaramam Temple | Shivalayam | Bhimavaram | West Godavari | AP Tourism Temple
పశ్చిమగోదావరి
జిల్లాలోని భీమవరంలో ఉన్న గునుపూడి సోమేశ్వర ఆలయం సోమారామంగా పేరుతెచ్చుకుంది. ఈ
ఆలయాన్ని మూడో శతాబ్దంలో నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఇక్కడ నిత్యం పూజలు
అందుకునేది అయిదు అడుగుల ఎత్తుండే సోమేశ్వర స్పటిక లింగం. చంద్రగమనానుసారంగా ఈ
లింగకాంతులు మారతాయని చెబుతారు. ముఖ్యంగా అమావాస్య రోజున ఈ లింగం నలుపు మించిన
గోధుమ రంగులోకి, పౌర్ణమి రోజు దవళ
వర్ణానికి మారుతుందని భక్తులు విశేషంగా పేర్కొంటారు. సోమేశ్వర ఆలయానికి మరో
ప్రత్యేకత కూడా ఉంది. రెండంతస్తుల ఈ ఆలయం కింది భాగంలో సోమేశ్వర స్వామి కొలువై
ఉంటే అన్నపూర్ణ ఆలయం ఉంటుంది. మన దేశంలో మరెక్కడా ఇలా లేదు.
No comments