ఇక్కడ నరసింహస్వామి హిందువులకే కాదు ముస్లింలకు కూడా దేవుడే - స్తంభాద్రి ఆలయ చరిత్ర
నేను మీ గుండెబోయిన నరేష్, నా పదవ తరగతి అయిపోయిన తర్వాత, అప్పుడు సుమారు నా వయసు 18, నేను పాలిటెక్నిక్ చదవడానికి ఖమ్మం వెళ్లడం జరిగింది. నేను కొన్ని రోజులు ఈ ఆలయం ప్రాంతంలోనే నివసించడం జరిగింది. అప్పుడు నేను మా ఫ్రెండ్స్ కలిసి ప్రతి ఆదివారం ఇక్కడికి స్వామివారి దర్శనం చేసుకుని అన్నదానంలో భోజనం చేసేవాళ్లము. కొన్నిసార్లు ఇక్కడ మేము చదువుకునే వాళ్ళం కూడా. ఇప్పటికీ కూడా ఇక్కడి ప్రశాంతత వాతావరణాన్ని తలుచుకుంటే మళ్లీ పాత రోజులు జ్ఞాపకం వస్తున్నాయి. అలా మేము అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఒక యువ బ్రాహ్మణుడు పరిచయమయ్యాడు. ఆ బ్రాహ్మణుడు ఈ గుడి ప్రత్యేకత గురించి నాకు వివరంగా తెలుపడం జరిగింది. ఈ ఆలయ చరిత్ర గురించి మీకు చెప్తున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. అలాగే ఎంతో అదృష్టవంతుడిగా భావిస్తున్నాను.
స్వయంభువై వెలసిన అక్కడి లక్ష్మీనరసింహస్వామి హిందువులకే కాదు ముస్లింలకు కూడా దేవుడే.ఆ నరసింహస్వామికి నిత్యం పానకంతో అభిషేకం జరగాల్సిందే. ఆ క్షేత్రం పేరే స్తంభాద్రి, స్తంభాద్రి ఖమ్మం లో ఉంది.
వైశాఖ శుద్ధ చతుర్దశి నాటి సాయంకాలం హిరణ్యకశపుడి ఆస్థాన మండపంలోని ఒక స్తంభం లోంచి ఉద్భవించి ఆ రాక్షసుడిని సంహరించాడు నరసింహుడు. నరసింహుడు దశావతారాలలో నాలుగోవ అవతారమైన ఈ స్వామికి రాష్ట్రంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని ఆలయాలు ఎక్కువగా ఉంటాయి. అందులో ఒకటి ఖమ్మం జిల్లాలోని స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం. ఇది ఖమ్మం పట్టణ నడిబొడ్డున 150 అడుగుల ఎత్తున కొండపై ఉంది.
స్తంభాద్రి ఆలయ చరిత్ర :
సనాతన ధర్మానికి ఆయువుపట్టు లాంటి వాళ్ళు ఋషులు మనకు వేదాలను హాసనాలను ఆచారాలను సాంప్రదాయాలను గొప్ప సాంస్కృతిని ఇలా ఎన్నిటిలో మనకి ఇచ్చారు. మన దేశంలో చాలా ప్రాంతాలలో దేవాలయాలు ఏర్పాటు చేసింది కూడా ఈ ఋషులే. అదేవిధంగా స్తంభాద్రి లోను లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉండడానికి కారణం కూడా ఒక మహర్షి అని మనం చెప్పుకోవచ్చు. ఆయన పేరు మోదుగాలుడు. అప్పట్లో ఆ మహర్షి స్తంభాద్రి ప్రాంతానికి వచ్చాడంట అక్కడ ప్రశాంతత వాతావరణం నచ్చడంతో అక్కడే గృహలో శ్రీహరి కోసం తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆయన తపస్సుకు మెచ్చిన శ్రీహరి లక్ష్మీ సమేత నరసింహుడిగా ప్రత్యక్షమయ్యాడు అప్పుడు ఆ మహర్షి తన కోసం ఏమి కోరుకోకుండా. భక్తుల కోరికలు తీర్చుకుంటూ ఇక్కడే ఉండిపోవాలని కోరుకున్నాడు. ఆయన నిస్వార్థ భక్తికి మెచ్చిన శ్రీహరి గుహలో లక్ష్మీనరసింహుడిగా స్వయంభువై వెలిశాడని స్థలపురాణం చెబుతుంది.
16 శతాబ్దంలో కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు ఈ స్తంభాద్రిని దర్శించుకుని మండపాన్ని నిర్మించాడు. ఖమ్మం ఖిల్లా నిర్మాణ సమయంలో ఈ లక్ష్మీనరసింహస్వామికి కాకతీయ రాజులే ఆలయ నిర్మాణం చేపట్టారని చరిత్ర చెబుతుంది. ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒకే రాతితో నిర్మించిన ఏకశీల గజ స్థంభం. ఈ ఆలయంలోని మరో విషయం ఏమిటంటే ఇక్కడ స్వామి దక్షిణం వైపు ముఖం చేసి ఉంటారు పక్కనే లక్ష్మీదేవి కూడా ఉంటుంది. అక్కడే తూర్పు ముఖంగా కొలువైన ఆంజనేయస్వామి మందిరం కూడా ఉంటుంది.
ప్రధాన ఆలయానికి వెనకాలే ఒక కోనేరు కూడా ఉంది. శిష్య బృందంతో ఉన్న మౌదగలయ్యా మహర్షి దేవాలయానికి దర్శించడానికి వచ్చిన వారు స్నానం చేసుకోవడానికి నీరు కూడా కావాలని అడిగాడంట. అప్పుడు లక్ష్మీనరసింహస్వామి పాదం తాకడంతో గుట్ట రెండుగా చీరీ ఈ కోనేరు ఏర్పడింది. ఆ కోనేరులో ఉండే ప్రత్యేకత ఏమిటంటే ఎండాకాలంలో కూడా నీరు ఎప్పటికీ ఉంటాయి. కోనేటిలోని నీరు ఎండిపోవడం అని ప్రసక్తే లేదు. వర్షాకాలంలో నీరు ఎక్కువగా వచ్చినప్పుడు.. ఈ కోనేరు ఆనుకొని ఉన్న ఆలయంలోని స్వామివారి నాభి సూత్రం నుంచి గర్భాలయంలోని స్వామివారి దగ్గరికి నీరు చేరుతుంది. దానివల్ల భక్తులకు ఇబ్బంది కాకుండా పైప్ లైన్ ద్వారా ఈ నీటిని బయటికి పంపడానికి ఏర్పాటు చేశారు.
నరసింహ స్వామికి పానకం అంటే చాలా ఇష్టం. నరసింహునికి పానకంతో అభిషేకం చేస్తే ఉగ్రరూపంలో ఉన్న ఆయన శాంతిస్తాడని పురాణాల్లో రాసుంది. ఇక్కడ ఇప్పటికీ ప్రతి ఆదివారం అన్నదానం జరుగుతుంది.
ఈ ఆలయానికి హిందువులతో పాటు ముస్లింలు కూడా వస్తారు. ఈ ఆలయం చుట్టుముట్టు ముస్లింలు ఎక్కువ శాతంగా ఉంటారు కావున పెద్దల కాలం నుండి ఈ నరసింహ స్వామి వారు చాలా నమ్ముతారు. అంతేకాకుండా ఉగాదినాడు ఆయనకు పూజలు కూడా జరిపిస్తారు ముస్లింలు.
ఈ ఆలయంలో మరో విషయం కూడా ఉంది నల్ల రాతితో చేసిన సాయిబాబా విగ్రహం ఉండే ఆలయం మన రాష్ట్రంలో ఇది ఒక్కటే సుమారు 6 ఎత్తు ఉండే ఈ సాయిబాబాను కృష్ణుడి అంశంగా చెబుతారు అందుకే కృష్ణాష్టమి నాడు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు.
No comments