Header Ads

Header ADS

Trishakti Peetam Temple | Mahakaali Laxmi Saraswati Temple | Vijayawada | AP Temples


విజయవాడ కొత్త బస్టాండ్ పక్కన గల శ్రీ త్రిశక్తి పీఠం నగరంలోని ప్రసిద్ధ ఆలయాల్లో ఒకటి. ఇచ్చా క్రియాజ్ఞానశక్తికి ప్రతీకలైన శ్రీ మహాకాళి, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహాసరస్వతి అమ్మవార్ల దేదీప్యమానమైన విగ్రహాలతో విలసిల్లుతోంది. ఈ మూర్తులలో శ్రీ మహాకాళి స్వయంభూశక్తిగా నెల్లూరు పరిసరారణ్యముల నుండి 1941వ సం॥లో ఇక్కడకు తెచ్చి చిన్న ఆలయంగా ప్రతిష్టించిన దరిమిలా 1989 సం॥లో అధునాతన ఆలయ సముదాయంతో భక్తుల కోరికల మేరకు ఆలయ ఆధ్యాత్మిక సలహాదారుచే పునఃప్రతిష్ఠ గావింపబడి వేలాది భక్తుల మనోభీష్టం నెరవేర్చుచున్నది. ఆవాహనచేసి ఆ విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ఠించారు.
మొదట 1947 సం॥లో ఇక్కడ కాళీమాత విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్న ఈ ఆలయం, 1989 వ సం॥లో త్రిశక్తి పీఠంగా రూపుదిద్దుకొని భక్తులను మరింతగా ఆకర్షిస్తున్నది. దసరా పండుగ రోజుల్లో ఈ శ్రీ త్రిశక్తి పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించటం ప్రతీకగా వస్తుంది. విద్యార్థులు, వర్తక వ్యాపారవేత్తలు కనకదుర్గ ఆలయాన్ని సందర్శించే యాత్రికులు అందరూ నిత్యం ఈ ఆలయాన్ని సందర్శించటం విశేషం. వివిధ కారణాలపై విజయవాడకు రాకపోకలు సాగించే ప్రజానీకం కూడా బస్టాండు సమీపంలో వున్న ఈ ఆలయాన్ని సందర్శించి ఇక్కడకు వేంచేసి వున్న అమ్మవార్ల ఆశీస్సులు పొందటం నిత్యం జరిగే కార్యక్రమం.

No comments

Powered by Blogger.